Ind U-19: ఆసియా అండర్-19 ప్రపంచకప్ లో భారత్ తొలి విజయం.. 19 d ago
ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మొదటి మ్యాచ్ ఓడగా, సోమవారం జపాన్ తో జరిగే మ్యాచ్ లో 211 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. కెప్టెన్ మహ్మద్ అమాన్ 122 నాటౌట్ (118) శతకం సాధించాడు. మొదట భారత్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 54(29) వైభవ్ సూర్యవంశీ 23 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. ఛేదనలో జపాన్ తేలిపోయింది. చేతన్ శర్మ (2/14), హార్దిక్ రాజ్ (2/9), కార్తికేయ (2/21) ధాటికి 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది.